- ట్వీట్ పెట్టిన వెంటనే స్పందించిన బల్దియా సిబ్బంది
గండిపేట, వెలుగు: కొందరు ట్రక్కులో చెత్తను తెచ్చి గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్సమీపంలో పోస్తుండగా ప్రముఖ న్యాయవాది బల్వంత్‌రెడ్డి వీడియో తీసి ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్చేశాడు. జీహెచ్ఎంసీ కమిషనర్, సీఎంఓ, టీఎస్పోలీస్, బల్దియా ఆఫీసర్లను ట్యాగ్చేశారు. వెంటనే స్పందించిన బల్దియా అధికారులు డంప్ చేసి వెళ్లిన ఆటోను గుర్తించారు.
తిరిగి అదే ప్రాంతానికి రప్పించి, సదరు వ్యక్తులతో చెత్తను ఆటోలోకి ఎత్తించారు. వెంటనే స్పందించిన అధికారులకు బల్వంత్‌రెడ్డి థ్యాంక్స్చెప్పారు. మంగళవారం ఆ వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.