మంత్రి శ్రీధర్ బాబుతో బల్గేరియా రాయబారి భేటీ

మంత్రి శ్రీధర్ బాబుతో బల్గేరియా రాయబారి భేటీ
  • వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఆసక్తి

హైదరాబాద్, వెలుగు: ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో బల్గేరియా రాయబారి నికోలాయ్ యాంకోవ్ భేటీ అయ్యారు. బుధ వారం సెక్రటేరియెట్ లో ఆయన దేశ గౌరవ కాన్సులేట్, సుచిర్  ఇండియా ఇన్ ఫ్రా సీఈవో కిరణ్​ కుమార్​తో కలిసి మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వాణిజ్య, సాంస్కృతిక అంశాల్లో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని నికోలాయ్ యాంకోవ్ తెలిపారు. 

రెండు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి కామన్​ ప్లాట్​ఫాం ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు మంత్రి శ్రీధర్ బాబు ఒకే చెప్పారు. నూతన ఆవిష్కరణలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ కు సంబంధించి రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు.