నాటు బాంబు తిని తీవ్రంగా గాయపడ్డ ఎద్దు

కాగజ్ నగర్, వెలుగు: అడవి పందుల కోసం వేటగాళ్లు పెట్టిన నాటు బాంబు తిని ఎద్దు తీవ్రంగా గాయపడింది. కౌటాల  మండలం మొగడ్ దగడ్ గ్రామానికి చెందిన రైతు ఎలములే జీత్రు ఎద్దు బుధవారం ఊరి సమీపంలోని చెరువు వైపు మేతకు వెళ్లింది. అయితే అక్కడ అడవి పందుల కోసం వేటగాళ్లు భాస్వరం రాళ్లు, గాజు పెంకులు కలిపి నాటు బాంబు(గోలి) తయారు చేసి ఆహారంగా పెట్టగా దాన్ని ఎద్దు తిన్నది. దీంతో ఆ బాంబు పేలడంతో ఎద్దు మూతి ఛిద్రమైంది. ఎద్దు చావుబతుకుల్లో ఉందని.. నాటుబాంబు పెట్టిన నిందితులపై చర్యలు తీసుకోవాలని జీవ్ర పేర్కొన్నాడు.