వీడియో: పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్

వీడియో: పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్

అనంతపురం జిల్లా కసాపురం నెట్టెకంటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పార్క్ చేసిన బుల్లెట్ బైకు పెట్రోల్ ట్యాంక్ పెద్ద శబ్దం చేస్తూ.. పేలిన ఘటన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన ఈ ఘటన యాదృచ్చికంగా ఓ వ్యక్తి వీడియోలో రికార్డయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది.  
ట్యాంకులో ఉన్న పెట్రోల్ అంతా  మండడంతో పెద్ద ఎత్తున మంట చెలరేగడం వీడియోలో రికార్డయింది. అకస్మాత్తుగా జరిగిన ఘటనను గమనించిన అక్కడ ఉన్న వారు ఉలిక్కిపడ్డారు. పార్క్ చేసిన ఈ బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలిన సమయంలో దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మైసూరుకు చెందిన వ్యక్తి ఈ బుల్లెట్ బండిపై మైసూరు నుండి అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణ శివార్లలోని కసాపురం ఆంజనేయస్వామి ఆలయానికి నాన్ స్టాప్ గా వచ్చినట్లు సమాచారం. వందల కిలోమీటర్లు నాన్ స్టాప్ గా బైకు నడుపుకుంటూ వచ్చి పార్క్ చేసిన కాసేపటికే పేలినట్లు స్థానికుల కథనం. 

 

 

 

 

 

ఇవి కూడా చదవండి

25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్

కాలేజీ విద్యార్థినులతో స్టెప్పులేసిన కలెక్టరమ్మ

మౌనంగా ఉండొద్దు..ఏవిధంగా సాయం చేయగలరో చేయండి

డ్రగ్స్ విషయంలో పోలీసుల తీరు సరికాదు