నార్సింగిలో మరోసారి ఇంట్లోకి దూసుకెళ్లిన బులెట్.. 

నార్సింగిలో మరోసారి ఇంట్లోకి దూసుకెళ్లిన బులెట్.. 

నార్సింగిలో మరోసారి బులెట్ ఇంట్లోకి దూసుకెళ్ళింది. రెండువారాల కింద జరిగిన ఘటన మరువక ముందే మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యింది. నార్సింగీ మున్సిపాలిటీ పరిధిలోని  గంధంగూడ లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యి బులెట్ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఓ ఇంట్లోకి ఉన్న మహిళ కాలులోకి బులెట్ దూసుకెళ్లింది. బులెట్ కలలోకి దూసుకెళ్లడంతో మహిళ అక్కడిక్కడే కుప్పకూలింది.

మహిళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఆర్మీ ఫయరింగ్ రేంజ్ లో జవాన్లు ఫయరింగ్ చేస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.కాగా,ఈ నెల లోనే ఇలా జరగటం ఇది రెండవసారి.

రెండువారాల కిందట కూడా నార్సింగిలోని బైరాగిగుడలోని ఓ అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లింది బులెట్. ఆర్మీ ఫయరింగ్ రేంజ్ లో ఫయరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న  క్రమంలో ఓ బుల్లెట్ మిస్ ఫయర్ అయ్యి అపార్ట్ మెంట్ ఐదవ అంతస్తులోకి దూసుకెళ్లింది బులెట్. అయితే, ఈ ఘటనలో బులెట్ ఎవ్వరికీ తగలేకపోవటంతో ప్రమాదం తప్పింది.