బుల్లెట్ లేడీ నిఖిల అరెస్ట్ : సోషల్ మీడియా పాపులారిటీతో డ్రగ్స్ అమ్మకం

బుల్లెట్ లేడీ నిఖిల అరెస్ట్ : సోషల్ మీడియా పాపులారిటీతో డ్రగ్స్ అమ్మకం

అమ్మో.. అమ్మో ఎంత కిలాడీ.. అమాయకురాలుగా కనిపిస్తూ ఏం దందా చేస్తుంది.. పర్యాటకం పేరుతో ఎన్ని కుట్రలు చేస్తుందీ.. కేరళ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం. దీనికి కారణం.. బుల్లెట్ లేడీ నిఖిల అరెస్ట్. తనిఖీల్లో బుల్లెట్ లేడీ నిఖిల దగ్గర డ్రగ్స్ దొరకటంతో ఆమెను అరెస్ట్ చేశారు కన్నూర్ పోలీసులు. ఇంతకీ బుల్లెట్ లేడీ నిఖిల ఎవరు.. ఆమె ఈ దందా ఎలా చేస్తుంది అనేది తెలుసుకుందామా..

అసలు పేరు నిఖిల శంకర్. బుల్లెట్ పై తిరుగుతూ ఉండటంతో బుల్లెట్ లేడీ నిఖిల పేరుతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. బుల్లెట్ పై కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో తిరుగుతూ.. పర్యాటక ప్రాంతాలను, జర్నీ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే నిఖిలకు చాలా మంది దోస్తులు అయ్యారు. దీన్ని అవకాశంగా తీసుకుని డ్రగ్స్ దందా మొదలుపెట్టిందంట.. ఈ విషయాన్ని కేరళ పోలీసులే చెబుతున్నారు. 

కొన్ని రోజుల క్రితం బెంగళూరు నుంచి వస్తూ వస్తూ డ్రగ్స్ తీసుకొచ్చిదంట బుల్లెట్ లేడీ నిఖిల. ఈ డ్రగ్స్ ను కేరళలోని పయ్యన్నూర్ ప్రాంతంలో అమ్ముతూ ఉండగా.. ఎక్సైజ్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవటంతో కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు. ఆమె నుంచి నాలుగు గ్రాముల మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడించింది బుల్లెట్ లేడీ నిఖిల. 

ALSO READ | కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు స్పాట్ డెడ్

బుల్లెట్ లేడీ నిఖిల డ్రగ్స్ దందా కొత్తేమీ కాదంటున్నారు కేరళ పోలీసులు. 2023లో రెండు కేజీల గంజాయితో దొరికిందని.. అప్పట్లో కేసు పెట్టి అరెస్ట్ చేసినట్లు వివరించారు. టూరిజం పేరుతో తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో పరిచయం అయిన వాళ్లకు ఈ గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నట్లు వెల్లడించారు పోలీసులు. మొత్తానికి బుల్లెట్ లేడీ నిఖిల అసలు బాగోతం తెలిసి.. ముక్కున వేలేసుకుంటున్నారు కేరళ జనం. 30 ఏళ్లకే ఇన్ని వేషాలు వేస్తుందా అంటూ గుసగుసలాడుకుంటున్నారు.