బోధన్ పట్టణ శివారులోని కమ్మ సంఘం ఏరియాలో ‘బుల్లెట్ రెడ్డి’ సినిమా షూటింగ్జరిగింది. హీరో ఆదినారాయణ, హీరోయిన్ మేఘపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. బోధన్‌కు చెందిన కరాటే మాస్టర్ ఖయ్యుమ్ ఆధ్వర్యంలో ఫైట్ సీన్ తీశారు. ఈ సినిమా షూటింగ్ బోధన్ పరిసర ప్రాంతాలలో పూర్తి చేయనున్నట్లు హీరో ఆదినారాయణ తెలిపారు.
సినిమా షూటింగ్ తిలకించడానికి బోధన్, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. సినిమా షుటింగ్ కు అనుమతి ఇచ్చిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్, కమ్మ సంఘం నిర్వాహకులకు ఆదినారాయణ కృతజ్ఞతలు తెలిపారు.