పుంజుకున్న స్టాక్ మార్కెట్: BSE మార్కెట్ క్యాప్ రూ.400 లక్షల కోట్లు

పుంజుకున్న స్టాక్ మార్కెట్: BSE మార్కెట్ క్యాప్ రూ.400 లక్షల కోట్లు

స్టాక్ మార్కెట్ తిరిగి పుంచుకుంది. బుధవారం స్మార్ట్ రికవరీని అందుకున్నాయి. ప్రధాని మోదీ మూడోసారి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న క్రమంలో ఈ ర్యాలీ జరిగింది.  సెన్సెక్స్ 1613 పాయింట్లు పెరిగి 73వే 692 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 513 పాయింట్లు లాభపడి 22వేల 398 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. BSE లిస్టెండ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 403.12 లక్షల కోట్లకు చేరుకుంది. 

సెన్సెక్స్ లో హచ్ యూఎల్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, కోటక్ బ్యాంక్, ఐటీసీ కంపెనీలు 7.53 శాతం లాభపడ్డాయి. ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్ మాత్రం సెన్సెక్స్ 1.38 శాతానికి పడిపోయాయి. అంతకుముందు సెషన్ లో నమోదైన రూ. 395.42 లక్షల కోట్ల విలువతో పోలిస్తే ఇన్వెస్టర్ల సంపద రూ. 7.61 లక్షల కోట్లు పెరిగి రూ. 403.03లక్షల కోట్లకు చేరుకుంది. BSE లో ఆటో , కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ స్టాక్ లు వరుసగా 1685.4 పాయింట్లు, 1402 పాయింట్లు, 800 పాయింట్లు పెరగడంతో టాప్ సెక్టోరల్ గెయినర్లుగా ఉన్నాయి. 

మరోవైపు క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ టాప్ లూజర్ గా ఉన్నాయి. వాటి BSE ఇండెక్స్ 270 పాయింట్లు పడిపోయి 51,975 వద్దకు చేరుకుంది. BSE  మిడ్ క్యాప్ ఇండెక్స్ 116.76 పాయింట్లు లాభపడి 41, 904 వద్దకు చేరుకుంది. ఇది విస్తృత మార్కెట్ లో బుల్లిష్ ని సూచిస్తుంది. BSEలో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇండెక్స్ 594 పాయింట్లు పడిపోయింది. 44వేల 363 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 

విదేశీ సంస్థల ఇన్వెస్టర్లు మంగళవారం నికర ప్రాతిపదికన రూ. 12,436 కోట్ల విలువైన ఈక్విటీలు విక్రియించగా.. తాత్కాలిక NSE డేటా ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లు రూ. 3318.98 కోట్ల షేర్లను ఆఫ్ లోడ్ చేశారు.