ఆర్సీబీతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కూ బుమ్రా డౌటే..

ఆర్సీబీతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కూ బుమ్రా డౌటే..

ముంబై: ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. ఈ నెల 7న రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆడటం కూడా డౌట్‌‌‌‌‌‌‌‌గానే ఉంది. వెన్ను నొప్పి నుంచి కోలుకుంటున్న అతను మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌కు చాలా దగ్గరగా ఉన్నాడు. ఇటీవల బీసీసీఐ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌లో బౌలింగ్ వర్క్‌‌‌‌‌‌‌‌ లోడ్‌‌‌‌‌‌‌‌ను కూడా భారీగా పెంచాడు. కానీ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో టెస్ట్ సిరీస్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని బుమ్రా ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను మరోసారి పూర్తి స్థాయిలో పరిశీలించాలని బీసీసీఐ భావిస్తోంది. 

ఫైనల్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ పరీక్షల తర్వాత మెడికల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే తుది నివేదికను బట్టి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఆడించాలని ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మెడికల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇస్తే ఈ నెల 13న ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జనవరిలో బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ ఫైనల్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో వెన్ను నొప్పికి గురైన బుమ్రా తర్వాత చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీకి దూరమయ్యాడు. అప్పటి నుంచి రిహాబిలిటేషన్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాడు.