అశ్విన్‌‌ రికార్డు సమం చేసిన బుమ్రా

అశ్విన్‌‌ రికార్డు సమం చేసిన బుమ్రా

దుబాయ్‌‌ : టీమిండియా స్పీడ్‌‌స్టర్ జస్‌‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత అందుకున్నాడు. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లకు చేరుకున్న ఇండియా బౌలర్‌‌‌‌గా రవిచంద్రన్‌‌ అశ్విన్ రికార్డును సమం చేశాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌‌లో బుమ్రా తన టాప్ ప్లేస్‌‌ను నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో 9 వికెట్లు పడగొట్టిన అతను తన రేటింగ్ పాయింట్లను 904కి పెంచుకున్నాడు.

2016 డిసెంబర్‌‌‌‌లో అశ్విన్‌‌ ఇండియా నుంచి అత్యుత్తమంగా ఇన్నే పాయింట్లతో రికార్డు సృష్టించాడు. బుమ్రా తర్వాత కగిసో రబాడ (856 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా.. జోష్‌‌ హేజిల్‌‌వుడ్ (852) మూడో ప్లేస్‌‌లో నిలిచాడు. ఇండియాపై వరుసగా రెండు సెంచరీలు కొట్టిన ఆసీస్‌‌ స్టార్‌‌‌‌ ట్రావిస్ హెడ్ బ్యాటర్లలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. రూట్, హ్యారీ బ్రూక్‌‌, కేన్ విలియమ్సన్‌‌ టాప్–3లో ఉన్నారు. ఆల్‌‌రౌండర్లలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.