వరల్డ్ నెంబర్ బౌలర్ బుమ్రా బౌలింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తనదైన బౌలింగ్ తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడతాడు. ఎంతటి స్టార్ బ్యాటర్ అయినా ఈ యార్కర్ల వీరుడి బౌలింగ్ ను ఆచితూచి ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఎవరైనా ధైర్యంగా షాట్ ఆడాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. మరీ చెత్త బాల్ వస్తే మాత్రమే బౌండరీ వెళ్తుంది. అయితే ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ రూట్ మాత్రం బుమ్రా బౌలింగ్ లో ప్రయోగం చేసి దొరికిపోయాడు.
రాజ్ కోట్ టెస్ట్ రెండో రోజు ఆటలో భాగంగా రూట్ తన చేజేతులా వికెట్ పోగొట్టుకున్నాడు. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ బుమ్రా బౌలింగ్ లో అనవసరపు షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 40వ ఓవర్ నాలుగో బంతికి బుమ్రా వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడిన రూట్ మూల్యం చెల్లించుకున్నాడు. షాట్ సరిగా టైం కాకపోవడంతో సెకండ్ స్లిప్ లో ఉన్న జైస్వాల్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ ఆట ప్రారంభంలోనే కీలకమైన రూట్ వికెట్ కోల్పోయింది. సాధారణంగా రూట్ ఫాస్ట్ బౌలింగ్ లో రివర్స్ స్కూప్ ఆడటంతో సిద్ధహస్తుడు. కానీ బుమ్రా ముందు తన ఆటలు చెల్లలేదు.18 పరుగులు చేసి రూట్ ఔటయ్యాడు.
టెస్టుల్లో బుమ్రా 9 సార్లు రూట్ వికెట్ ను తీసుకోవడం విశేషం. రూట్ ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఆ తర్వాత చక చక తమ వికెట్లను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ స్పిన్ ధాటికి బెయిర్ స్టో (0) డకౌట్ కాగా.. ఇదే ఊపులో సెంచరీ హీరో డకెట్ (153) ను తన బుట్టలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 53 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. క్రీజ్ లో స్టోక్స్ (26), ఫోక్స్ (0) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఇంకా 179 పరుగులు వెనకబడి ఉంది.
Bumrah gets Joe Root for the 9th time in Tests. ?
— Johns. (@CricCrazyJohns) February 17, 2024
- A terrific catch by Jaiswal....!!!!pic.twitter.com/cCxRTFZbkU