IND Vs ENG: క్రమశిక్షణ తప్పాడు: బుమ్రాపై కొరడా ఝళిపించిన ఐసీసీ

IND Vs ENG: క్రమశిక్షణ తప్పాడు: బుమ్రాపై కొరడా ఝళిపించిన ఐసీసీ

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా క్రమశిక్షణ తప్పినందున కారణంగా ఐసీసీ పనిష్ చేసింది. ప్రవర్తనా నియమావళిలో భాగంగా  లెవల్ 1ని ఉల్లంఘించినందుకు గాను భారత పేసర్ బుమ్రాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 1 డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. రానున్న ఇర‌వై నాలుగు నెల‌ల్లో ఈ భారత పేసర్ ఖాతాలో మరో మూడు డీమెరిట్ పాయింట్లు చేరితే నిషేధం పడనుంది. ఓ టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వ‌న్డేలు, టీ20 మ్యాచ్‌లు నిషేధం ప‌డే అవ‌కాశం ఉంది. 

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో నాలుగో రోజు ఆటలో భాగంగా ఒల్లీ పోప్‌ను బుమ్రా టార్గెట్ చేశాడు. పోప్ సింగిల్ తీస్తుండగా ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకున్నాడు. 81 ఓవర్లో నాలుగో బంతికి బుమ్రా వేసిన బంతిని ఆడటంతో పోప్ విఫలమయ్యాడు. షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి ప్యాడ్ కు తగిలింది. దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో సింగిల్ తీయడానికి వెళ్తుండగా పోప్ భుజాన్ని బుమ్రా తాకాడు. దీంతో ఇద్దరి మధ్య కాస్త మాటల యుద్ధం నడిచింది. ఈ మ్యాచ్ తర్వాత పోప్ కు బుమ్రా క్షమాపణలు చెప్పాడు.
 
ఈ మ్యాచ్ లో బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో రెండు, రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు పోప్ మొదటి ఇన్నింగ్స్ లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్ లో 196 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 202 పరుగులకే ఆలౌటైంది.