
దుబాయ్: ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ అవార్డులను అందుకున్నాడు. ఇండియా–పాక్ మ్యాచ్‌కు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీసీ అధికారులు పేసర్‌కు నాలుగు పురస్కారాలను అందజేశారు. ‘మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, మెన్స్ టెస్ట్, టీ20 టీమ్–2024’ అవార్డులు ఇందులో ఉన్నాయి. బుమ్రా నాలుగు అవార్డులతో కలిసి ఉన్న ఫొటోను ఐసీసీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఇందులో రెండు క్యాప్‌లు, రెండు ట్రోఫీలు ఉన్నాయి. ఇక వామప్ డ్రిల్ సందర్భంగా బుమ్రా.. టీమిండియా ప్లేయర్లతో సరదాగా గడిపాడు. ప్రతి ఒక్కర్ని ఆపాయ్యంగా పలుకరిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్పాడు. గతేడాది టెస్ట్‌ల్లో బుమ్రా 13 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీశాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో 70 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో ఇండియన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. కపిల్ దేవ్ కుంబ్లే, అశ్విన్ ముందున్నారు. వెన్ను నొప్పి కారణంగా బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం లేదు.