ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్ట్‌లో టీమిండియా స్పీడ్‌స్టర్ బుమ్రా ఆడటం లేదు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతనికి రెస్ట్ ఇచ్చారు. దీంతో టీమ్ నుంచి బుమ్రాను మంగళవారం రిలీజ్ చేశారు. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న కేఎల్ రాహుల్ నాలుగో టెస్ట్‌కూ అందుబాటులో ఉండటం లేదు. అయితే ఫిట్‌నెస్‌తో ఉంటే ఆఖరి టెస్ట్‌లో ఆడే ఛాన్స్ ఉంది. బుమ్రా ప్లేస్‌లో ముకేశ్ కుమార్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. బుమ్రా మార్చి 7 నుంచి ధర్మశాలలో జరిగే ఐదో టెస్ట్‌కు అందుబాటులో ఉండనున్నాడు.
తొలి మూడు టెస్టులు ఆడిన బుమ్రా ఫిట్ గా ఉన్నప్పటికీ.. అతని మీద పని భారం తగ్గించాలని టీం యాజమాన్యం భావిస్తోందట. టెస్ట్ సిరీస్ తర్వాత భారత ఆటగాళ్లు ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. రానున్న మూడు నెలలు బుమ్రా ఫిట్ గా ఉండటం టీమిండియాకు చాలా కీలకం. దీంతో రాంచీలో జరగబోయే నాలుగో టెస్ట్ కు ఈ స్టార్ పేసర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతుంది. మరోవైపు రాహుల్ మోకాలి గాయం కారణంగా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్ జరుగుతుంది.
రాహుల్ ఫిట్ గా లేకపోవడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫామ్ లో లేని పటిదార్ కు మరో అవకాశం దక్కనుంది. బుమ్రా లేకపోవడంతో సిరాజ్, ముఖేష్ కుమార్ పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయినా.. వరుసగా వైజాగ్, రాజ్ కోట్ టెస్టుల్లో భారీ విజయాలను సొంతం చేసుకుంది.
BCCI announced their updated squad for the fourth Test against England. pic.twitter.com/9aal9Ewt2b
— CricTracker (@Cricketracker) February 20, 2024