Team India: బుమ్రాను చెరకు రసం పిండినట్లు పిండారు: మాజీ స్పిన్నర్

Team India: బుమ్రాను చెరకు రసం పిండినట్లు పిండారు: మాజీ స్పిన్నర్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీను టీమిండియా 1-3 తేడాతో కోల్పోయినప్పటికీ.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఔరా అనిపించాడు. ఐదు టెస్టుల్లో  32 వికెట్లు పడగొట్టి భారత్‌ తరుపున అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. సిడ్నీ టెస్టు ఆఖరిలో గాయం కారణంగా వైదొలిగాడు కానీ, లేదంటే మరో నాలుగు వికెట్లు అతని ఖాతాలో చేరేవి. అందుకోసం అతని వేసిన మొత్తం ఓవర్ల సంఖ్య.. 151.2 ఓవర్లు. 

ప్రత్యర్థి జట్టులో పదిమందిని ఔట్ చేయడానికి బుమ్రా ఒక్కడు 5 వికెట్లు పడగిడితే..  ఇతర బౌలర్లంతా కలిసి మరో ఐదు వికెట్లు పడగొట్టేవారు. ఇంకా చెప్పాలంటే.. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలవాలన్న కసి కనిపించిన ఐదారుగురు ఆటగాళ్లలో బుమ్రా ఒక్కడు. తనలో ఎనర్జీ లేకున్నా.. జట్టుకు అవసరం ఉన్న ప్రతిసారి బంతిని చేతికందుకున్నాడు. వికెట్లు పడగొడుతూ వచ్చాడు. ఆ పని భారమే అతన్ని కొన్ని రోజుల పాటు క్రికెట్‌కు దూరం చేసింది. వెన్నునొప్పి కారణంగా బుమ్రా కొన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరమయ్యడు. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

టీమ్ మేనేజ్మెంట్ బుమ్రాను చెరకు నుండి రసం పిండినట్లు పిండిందని హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించారు. చివరికి అతన్ని అందుబాటులో లేని పరిస్థితికి దిగజార్చారని విమర్శించారు. సిడ్నీ టెస్టు చివరి రెండు రోజులు బుమ్రా అందుబాటులో ఉండుంటే.. సిరీస్ సమం అయ్యే అవకాశాలు ఉండేవని అభిప్రాయపడ్డారు. 

వాడకం అంటే ఇదే అన్నట్లు నిరూపించారు..

"బుమ్రాను చెరకు నుండి రసం పిండినట్లు వాడుకున్నారు. ట్రావిస్ హెడ్ వచ్చాడు.. బుమ్రాకి బంతి ఇవ్వండి. మార్నస్ వచ్చాడు.. బుమ్రాకి బంతి ఇవ్వండి. స్టీవ్ స్మిత్ వచ్చాడు.. బంతిని బుమ్రాకి ఇవ్వండి..' అనటమే తప్ప నాకు మరొకటి కనిపించలేదు.."

ALSO READ | Champions Trophy 2025: గిల్‌పై వేటు.. ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్‌గా బుమ్రా..?

"బుమ్రా ఒక్కడు ఎన్ని ఓవర్లు వేస్తాడు..? చివరకు అందుబాటులో లేని పరిస్థితికి దిగజారాడు. ఒకవేళ అతడు ఉండుంటే.. ఆస్ట్రేలియా ఐదో టెస్ట్ గెలిచి ఉండవచ్చు కానీ గెలుపు కోసం పోరాడిల్సి వచ్చేది. పని భారం పెంచి అతని వెన్ను విరిచారు.." అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడారు.

ఇద్దరు స్పిన్నర్లు ఎందుకు..?

పేసీ పిచ్ లపై తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటివ్వడంపైనా హర్భజన్ విమర్శలు గుప్పించారు. "జట్టు ఎంపిక సరిగా లేదు. స్పైసీ పిచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు ఆడారు.. మీకు ఆకుపచ్చ పాచెస్‌ కనిపించలేదా..!. ఇంత క్రికెట్ ఆడుతున్నా, ఇంత క్రికెట్ చూస్తున్నా మీకు ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కాలేదు.." అని హర్భజన్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని ప్రశ్నించారు.