![Jasprit Bhumrah : బుమ్రా సర్జరీ సక్సెస్.. జట్టులోకి ఎప్పుడంటే?](https://static.v6velugu.com/uploads/2023/03/bumrah_71sbl3BmhM.jpg)
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా గత కొంత కాలంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు శస్త్ర చికిత్స కోసం బుమ్రాను బీసీసీఐ న్యూజిలాండ్ కు పంపిచింది. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్), షేన్ బాండ్ (న్యూజిలాండ్)కు సర్జరీ చేసిన డాక్టర్ రోవన్ షౌటెన్.. బుమ్రాకు చికిత్స అందించాడు. ఆ సర్జరీ విజయంవంతం అయిందని క్రిక్ బజ్ ఓ నివేదికలో తెలిపింది.
అయితే, బుమ్రా పూర్తిగా కోలుకొని గ్రౌండ్ లోకి అడుగుపెట్టాలంటే దాదాపు ఆరునెలల సమయం పట్టొచ్చు. దీంతో బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్ లకు దూరం కానున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే అక్టోబర్, నవంబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కొచ్చు.