ఆరో రియల్టీ టీ9 చాలెంజ్‌‌‌‌‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో టాప్‌‌‌‌‌‌‌‌లో బంకర్ బస్టర్స్‌‌‌‌‌‌‌‌

ఆరో రియల్టీ టీ9 చాలెంజ్‌‌‌‌‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో టాప్‌‌‌‌‌‌‌‌లో బంకర్ బస్టర్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్: ఆరో రియల్టీ టీ9 చాలెంజ్‌‌‌‌‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో బంకర్‌‌‌‌‌‌‌‌ బస్టర్స్‌‌‌‌‌‌‌‌ సత్తా చాటింది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో బంకర్‌‌‌‌‌‌‌‌ బస్టర్స్‌‌‌‌‌‌‌‌ 3.5 తేడాతో ఐరా లయన్స్‌‌‌‌‌‌‌‌పై నెగ్గింది. దీంతో మొత్తం ఐదున్నర పాయింట్లతో పూల్‌‌‌‌‌‌‌‌–ఎలో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో కె. రాజు, ప్రతిమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ బస్టర్స్‌‌‌‌‌‌‌‌కు రెండు పాయింట్లు అందించారు. డబుల్స్‌‌‌‌‌‌‌‌ ప్లేలో ఎస్‌‌‌‌‌‌‌‌ మాంజర్‌‌‌‌‌‌‌‌–శైలేంద్ర థాప్లియాల్‌‌‌‌‌‌‌‌ ఒక పాయింట్లు రాబట్టగా, ఎస్‌‌‌‌‌‌‌‌. మురళీ–మజర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌కే రహమత్‌‌‌‌‌‌‌‌ అలీ అర్ధ పాయింట్‌‌‌‌‌‌‌‌ నెగ్గారు. 

టూటొరూట్‌‌‌‌‌‌‌‌ జట్టు ఐదు పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంది. పూల్‌‌‌‌‌‌‌‌–బిలో కైన్‌‌‌‌‌‌‌‌ డెయిరీ, ఫేర్‌‌‌‌‌‌‌‌వే ఫాల్కన్స్‌‌‌‌‌‌‌‌ జట్లు చెరో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. పూల్–సి లావిస్టా క్రూసేడర్స్ 4.5 పాయింట్లతో, పూల్–డిలో శ్రీనిధి డెక్కన్ వారియర్స్ 6 పాయింట్లతో  కొనసాగుతున్నాయి. ఈ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకమైన హోల్ -ఇన్ -వన్  పోటీలో వేణు పోలినేని  విజయం సాధించాడు.