బూర్గంపహాడ్, వెలుగు : మండలంలోని సారపాక గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను మంగళవారం బూర్గంపహాడ్ ఎస్ఐ సుమన్ పట్టుకున్నారు. ఇటీవల సారపాక గోదావరి బ్రిడ్జి నుంచి రాత్రి సమయంలో జోరుగా అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. మంగళవారం రాత్రి కూడా అక్రమ ఇసుక రవాణా దారులు పదుల సంఖ్యలో గోదావరి నదిలో ఇసుక రవాణాకు పాల్పడుతున్నారనే సమాచారంతో బూర్గంపహాడ్ ఎస్ఐ సుమన్ సిబ్బందితో దాడులు నిర్వహించారు.
ఆరు ట్రాక్టర్లు పట్టుబడగా మిగతా ట్రాక్టర్లు తప్పించుకున్నాయి. పట్టుబడిన ట్రాక్టర్లను బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్ల యజమానులతో పాటు డైవర్ల పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.