తాళాలు పగులగొట్టి ఇంట్లో చోరీ

మిర్యాలగూడ, వెలుగు :  నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, వన్ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న కసిరెడ్డి వెంకటరెడ్డి ఈనెల 7న ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లారు.  తిరిగి శనివారం ఇంటికి రాగా..  తాళాలు పగులగొట్టి కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండటంతో  వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు, డాగ్‌ స్క్వాడ్‌తో  అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. నాలుగు తులాల బంగారు నగలు చోరీ అయినట్లు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ సుధాకర్ చెప్పారు.