నల్ల పోచమ్మ ఆలయంలో చోరీ

నల్ల పోచమ్మ ఆలయంలో చోరీ

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణ శివారులోని నల్ల పోచమ్మ ఆలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఆలయ పూజారి ఈశ్వరా చారి గుడికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 

ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు వచ్చి చూడగా ఆలయంలోని అమ్మవారి మీద ఉన్న పుస్తెల తాడు, హారం, 2 తులాల వెండి విగ్రహాలు, ఇత్తడి నవగ్రహాలు, అమ్మవారి చీరలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వాటి విలువ రూ.33 వేలకు పైగా ఉంటుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.