కడెం,వెలుగు : కడెం మండలం సింగపూర్ గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గుడి తాళాలు పగులగొట్టి ఆలయంలోకి చొరబడ్డ దొంగలు 2 హుండీల్లో ఉన్న డబ్బులు, కానుకలను దొంగిలించారు.
ఉదయం గుడికి వచ్చిన పూజారి లింగయ్య చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కడెం ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు. క్లూస్‌టీం సహాయంతో ఆధారాలు సేకరించినట్లు చెప్పారు