వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో చోరీ

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగరం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మంగళవారం చోరీ జరిగింది. ఎస్సై సతీశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం ఆలయానికి వెళ్లిన వారు గేట్లు, హుండీ తాళం పగలకొట్టి ఉండడాన్ని గమనించి, గ్రామస్తులకు తెలిపారు. దీంతో ఆలయ నిర్వాహకుడు భిక్షం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హుండీలో సుమారు రూ.10 వేలు ఉన్నట్లు ఎస్సై చెప్పారు.