చికిలి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ

వెలుగు, మాక్లూర్ : మాక్లూర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని చికిలి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. మారినేని హరిచరణ్​రావు ఇంట్లో కొంత కాలంగా రెంట్​కు  ఉంటున్న డ్యాగ నీలకంఠం బుధవారం సాయంత్రం తన కూతురును కాలేజ్ లో చేర్పించేందుకు కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు.

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 6 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.లక్షా 25వేల నగదు దోచుకెళ్లారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సుధీర్ రావు పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు  చెప్పారు.