పిలుట్ల గ్రామంలో వీ6 వెలుగు పంచాంగం ఆవిష్కరణ

పిలుట్ల గ్రామంలో వీ6 వెలుగు పంచాంగం ఆవిష్కరణ

శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలం పిలుట్ల గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాది రోజు బర్మా స్వామి జాతర ఉత్సవాలను  గిరిజనులు,  గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం వీ6 వెలుగు పంచాంగానికి  మాజీ జడ్పీటీసీ మహేశ్ గుప్తా ప్రత్యేక పూజలు నిర్వహించి రిలీజ్ చేశారు. 

ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో వీ6 చానల్ కీలక పాత్ర పోషించిందన్నారు. అనంతరం లింగోజిగూడ తండాలో గిరిజనులు నిర్మించుకుంటున్న సేవాలాల్ జగదాంబ ఆలయానికి రూ. 50 వేల విరాళం అందజేశారు. యువకులకు క్రికెట్ కిట్టు అందజేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రమకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవి నాయక్, నాయకులు నరసింహారెడ్డి, సాములు, మధు, కుమార్, శేఖర్ గౌడ్  పాల్గొన్నారు.