- బీఆర్ఎస్ పై చెకోలేకర్ శ్రీనివాస్ ఫైర్
- బషీర్ బాగ్ లో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
బషీర్ బాగ్, వెలుగు : మహిళా మంత్రులపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బషీర్ బాగ్ చౌరస్తాలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చెకోలేకర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మంత్రి సీతక్కను ట్రోల్ చేసి మానసిక క్షోభకు గురిచేశారని, తాజాగా మంత్రి కొండా సురేఖను ఇష్టం వచ్చినట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియా అవమానించిందన్నారు. బడుగు బలహీన వర్గాల మంత్రులను అవమానించడం కేటీఆర్ కు తగదన్నారు.
కేటీఆర్ మీద గతంలో, ఇప్పుడు డ్రగ్స్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయని.. ఆయన బ్లడ్ శాంపిల్స్, గోర్లు, వెంట్రుకలు నార్కోటిక్ పంపించి నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో ఆజంపురా డివిజన్ ప్రెసిడెంట్ భాస్కర్, యువజన కాంగ్రెస్ నాయకుడు మహేశ్ కొల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.