కరీంనగర్ టౌన్, వెలుగు: పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మున్నూరుకాపు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన పొన్నాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామన్నారు. మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, లీడర్లు రాజశేఖర్, ఏవీ రమణ, అనంతుల రమేశ్ పాల్గొన్నారు.
వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.