గన్నేరువరం, వెలుగు: మానకొండూర్ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై గురువారం అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దళితులు, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
గన్నేరువరం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ వద్ద అక్బరుద్దీన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే కవ్వంపల్లిని బచ్చా కూర్చో అంటూ అవమానపరచడం హేయనీయమన్నారు. వెంటనే అక్బరుద్దీన్ దళిత ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మాతంగి అనిల్, న్యాత జీవన్ , రాజయ్య, నాగరాజు, శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, చంద్రరెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.