మోర్తాడ్ లో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

మోర్తాడ్ వెలుగు : ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే  పదవి నుండి తొలగించాలని కోరుతూ.. మోర్తాడ్ లో జిల్లా​ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చెపట్టారు. కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహ చేసి, నిరసన తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ సంఘం ప్రెసిడెంట్ జక్కం అశోక్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డిని పదవి నుంచి తొలగించకుంటే ముదిరాజులా తడాఖా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కరాటే రమేశ్, ఉపాధ్యక్షుడు బైరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.