
ఆమనగల్లు, వెలుగు: లీకైన నీట్ పరీక్షను వెంటనే రద్దుచేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కడ్తాల్, తలకొండపల్లి మండల కేంద్రాల్లో ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకై విద్యార్థులకు అన్యాయం జరిగిందని, నిర్వహణపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. మోహన్ రెడ్డి, అజీమ్, రవీందర్ యాదవ్, ఆరిఫ్, షాబుద్దీన్, రమేశ్ నాయక్ పాల్గొన్నారు.