కౌశిక్‌‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

భీమదేవరపల్లి, వెలుగు : హుజురాబాద్‌‌ ఎమ్మెల్యే కౌశిక్‌‌రెడ్డి దిష్టిబొమ్మను గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులో కాంగ్రెస్‌‌ లీడర్లు దహనం చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడం కోసం కుటుంబ సభ్యుల ప్రాణాలను బేరంగా పెట్టే సంస్కృతి కాంగ్రెస్‌‌ నాయకులకు లేదన్నారు.

సంచలనాల కోసం మంత్రి పొన్నంపై విమర్శలు చేయడం మానుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఐలయ్య, మాజీ అధ్యక్షుడు ప్రకాశ్‌‌, మహిళా అధ్యక్షురాలు స్వరూప, మాజీ చైర్మన్‌‌ శేఖర్‌‌ గుప్తా, యూత్‌‌ కాంగ్రెస్‌‌ నాయకులు పోగుల శ్రీకాంత్, జక్కుల అనిల్‌‌, నాయకులు గోపి, సమ్మయ్య, సదానందం పాల్గొన్నారు.

పొన్నంను విమర్శించే స్థాయి కౌశిక్‌‌రెడ్డికి లేదు

కమలాపూర్, వెలుగు : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ను విమర్శించే స్థాయి కౌశిక్‌‌రెడ్డికి లేదని హుజురాబాద్‌‌ నియోజకవర్గ యూత్‌‌ కాంగ్రెస్‌‌ జనరల్‌‌ సెక్రటరీ పోడేటి భిక్షపతి అన్నారు. గురువారం హుజూరాబాద్‌‌లో మీడియాతో మాట్లాడారు.

కౌశిక్‌‌రెడ్డికి, పొన్నం ప్రభాకర్‌‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఉద్యమకారుడైన మంత్రికి, మానుకోటలో ఉద్యమకారులపై, ప్రజలపై రాళ్లదాడి చేసి కౌశిక్‌‌రెడ్డికి పోలికే లేదన్నారు. సమావేశంలో తౌటం రవీందర్, నాయకులు బాలసాని రమేశ్‌‌, దేశిని ఐలయ్య, కొండా రమేశ్‌‌, విష్ణుదాసు వంశీధర్‌‌రావు, జనగాని శివకృష్ణగౌడ్ పాల్గొన్నారు.