కమ్మర్ పల్లిలో నమస్తే తెలంగాణ పత్రికల దహనం

కమ్మర్ పల్లిలో నమస్తే తెలంగాణ పత్రికల దహనం

బాల్కొండ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రహస్యంగా భేటీ అయ్యారంటూ తప్పుడు వార్తలు రాసిన నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రతులను ఆదివారం కమ్మర్​పల్లిలో కాంగ్రెస్​లీడర్లు దహనం చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వేణుగోపాల్, డీసీసీ అధికార ప్రతినిధి ఏలేటి గంగాధర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగల ప్రవీణ్, పాలెపు నర్సయ్య, లీడర్లు రేవతి గంగాధర్ పాల్గొన్నారు.