కళ్లలో నుంచి నీళ్లు కారుతుంటే పెద్దగా పట్టించుకోం. ఎర్రబడినా ఏదో పడిందని నిర్లక్ష్యం చేస్తాం. దురద పెడుతుంటే కాసేపు నలుస్తాం. మండుతుంటే మెడికల్ షాప్ కి వెళ్లి ఐ డ్రాప్ తెచ్చుకొని వేసుకుంటాం. కానీ.. నీళ్లు కారడం, ఎర్రబడడం, దురద, మండడం.. ఇవన్నీ అలర్జీ లక్షణాలు. ఈ అలర్జీకి ప్రధానకారణమేంటో తెలుసా? కాలుష్యం.. కళ్లకు కాలుష్యం చేసే హాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాలుష్యం త్నాస సంబంధిత సమస్యలకు మాత్రమే కారణమవుతుందని తెలుసు. కానీ కళ్లకు కూడా కాలుష్యం కలుగజేస్తున్న హాని గురించి చాలా మందికి అవగాహన లేదు. దీంతో కంటికి సంబంధించి ఏ సమస్య వచ్చినా అనిందను స్కార్ట్ గార్టెట్లపై వేస్తున్నారు. ఫోన్ కంప్యూటర్, టీవీ స్క్రీన్లను ఎక్కువసేపు చూడడం వల్ల కంటికి సమస్యలు వెస్తున్న మాట నిజమే. కానీ అంతకంటే ఎక్కువ హాని పొల్యూషన్ వల్ల కలుగుతోంది.
కళ్లకు రక్షణేది?
కలుషితమైన గాలిని పీల్చుకోకుండా ముక్కుకు కర్చీఫ్ కట్టుకుంటాం. దుమ్ము, ధూళి వంటివి లోపలికి వెళ్లకుండా కర్చీఫ్ అడ్డుకుంటుంది. మరి కంట్లో దుమ్ము పదకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటామా? కళ్లదాలు పెట్టుకుంటే సరి.. అంటారు కదూ? కానీ కళ్లద్దాలు ఎప్పుడు. పెట్టుకుంటున్నారు. సైట్ వచ్చినప్పుడు మాత్రమే. దూరంగా ఉన్నది కనపడక పోతేనో, పేపరు చదవలేకపోతేనో -స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లి కళ్లద్దాలు తీసుకుంటున్నారు. కానీ కాలుష్యం నుంచి కళ్లను కాపాడుకునేందుకు ఎంతమంది కళ్లద్దాలు పెట్టుకుంటున్నారు? ఒకవేళ కళ్లద్దాలు పెట్టుకున్నా అవి కళ్ళను పూర్తిగా కవర్ చేయవు, కళ్లద్దాలు సందులో నుండి దుమ్ము ధూళీ దూరిపోతాయి.
ALSO READ | నేషనల్ న్యూబార్న్ కేర్ వీక్: బిడ్డ పుట్టగానే ఏం చేయాలో తెలుసా.. ఈ స్టోరీ చదివేయండి.
పచ్చని ప్రకృతిలో కూడా...
పచ్చని చెట్లు ఉండేచోట గాలి స్వచ్ఛంగా ఉంటుంది. గుండెల నిండా నిర్భయంగా గాలి పీల్చుకోవచ్చు. కానీ పచ్చని ప్రకృతిలో కూడా కళ్లకు రక్షణ ఉండాల్సిందే. కారణం పుప్పొడి, పువ్వుల నుంచి గాల్లోకి చేరే పుప్పొడి రకరకాల అలర్జీలకు కారణమవుతుంది. దురదతో మొదలై నీళ్లు కారడం, ఎర్రబడడం. చివరకు చూపు తగ్గడానికి కూడా దారితీయొచ్చు. అందుకే బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా కళ్లద్దాలను పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.
అలర్జీలతో మరెన్నో సమస్యలు...
కళ్లలో అలర్ట్ మొదలైందంటే విపరీతంగా దురద పెడుతుంది. దీంతో నులుముకుంటూ నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల కనుగుడ్డు మీద ఉండే 'కార్నియా" అనే పొర పల్చబడుతుంది. అది కెరటోకోనస్' అనే సమస్యకు దారితీస్తుంది. దీనిని మొదట్లోనే గుర్తింది కంటి డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. లేదంటే కార్నియల్ హైడ్రన్స్ అనే సమస్యకు దారితీసి, చివరకు చూపు తగ్గిపోయే ప్రమాదముంది.
నిర్లక్ష్యం చేయొద్దు..
కంటి అలర్జీని నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే ఐ-స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్తే అలర్జీ తగ్గడానికి ట్రీట్ మెంట్ ఇస్తారు. అప్పటికే కెరటోకోనస్ కారణంగా చూపు దెబ్బతింటే దానిని సరి చేయడానికి కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్ వంటివి ఇస్తారు. కార్నియా పొర బాగా పల్చబడిన వాళ్లకు గుడ్లు మొత్తాన్ని కవర్ చేసే స్కేరల్ లెన్స్ వేస్తారు. కాకపోతే వీటి ధర ఎక్కువ. అద్దాల ద్వారా సరిదిద్దలేమనకున్నప్పుడు కార్నియాను సరిచేసేందుకు సర్జరీ చేయాల్చి ఉంటుంది లేదంటే కార్నియాను కూడా మార్చేస్తారు.
అలర్జీ దశలోనే అడ్డుకోవాలి..
మిగతా అలర్జీల్లాగే కంటి అలర్జీ కూడా పుప్పొడి రాలే కాలంలో ఎక్కువగా వేధిస్తుంది. అయితే. కొందరిలో ఇది ఏడాదంతా (పికెన్నియల్) ఉంటుంది. మనదేశంలో ఎక్కువగా 18 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో కనిపిస్తుంది. కారణం పిల్లలు మట్టిలో ఆడడం వేళ్లను అలాగే కంట్లో పెట్టుకోవడం వంటివి చేస్తారు. అందుకని పిల్లల విషయంలో అలర్జీన గుర్తించిన వెంటనే ట్రీట్ మెంట్ ఇప్పించాలి
అలర్జీ కారకాలు...
దుమ్ము, ధూళి, డస్టెమైట్స్ గా పిలిచే తవిటి పురుగులు, పుప్పొడి, పెంపుడు జంతువుల బొచ్చు, దూది కణాలు, పొగ, కొన్నిరకాల రసాయనాల వల్ల కంటి అలర్జీ వస్తుంది. బైక్ పై వెళ్లేవారు హెల్మెట్ తో కవర్ చేసుకోకుండా. వెళ్లడం, కళ్లద్దాలు పెట్టుకోకపోవడం అలర్జీకి దారితీస్తుంది..
డాక్టర్ దగ్గరకు వెళ్తే
అలర్జీని తగ్గించడానికి ట్రీట్ మెంట్ ఇస్తారు. ఇందుకోసం అలర్జీకి అతిగా స్పందిస్తున్నకణాలను నెమ్మదింపచేసేందుకు మందులిస్తారు. కళ్లు పొడి బారకుండా చూసేందుకు, ఆలర్జీ కారకాలను బయటకు పంపించేందుకు అర్టిఫిషియల్ టియర్స్' వంటి చుక్కలమందు వేస్తారు. సమస్య ఎక్కువగా ఉంటే కొద్దిరోజుల పాటు స్టిరాయిడ్స్ చుక్కల మందు కూడా వేయాల్సి ఉంటుంది.కానీ వీటిని ఎక్కువగా వాడితే నీటి కాసులు..శుక్లలు వంటివి వచ్చే ప్రమాదముంది.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
- అలర్జీకి కారణమయ్యేవాటికి దూరంగా ఉండాలి.
- దుమ్ము, ధూళి, కాలుష్య ప్రాంతాల్లోకి వెళ్లొద్దు.
- ఇల్లు దులిపినప్పుడు కళ్లకు రక్షణగా కళ్లద్దాలు పెట్టుకోవాలి.
- పుప్పొడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- చేతులతో కళ్లను అసలే రుద్దకూడదు. చల్లని నీళ్లతో కడుక్కోవాలి.
- అలర్జీ తగ్గడానికి ఐస్ క్యూబ్స్ కాసేపు కళ్లపై పెట్టుకోవాలి.