- పాత రాజంపేటలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గురువారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటలో అత్యధికంగా 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. డోంగ్లీలో 39.2 డిగ్రీలు, భిక్కనూరు, తాడ్వాయిల్లో 38.7 డిగ్రీలు, మేనూర్లో 38.6 డిగ్రీలు, వెల్పుగొండలో 37.8 డిగ్రీలు, బిచ్కుందలో 37.4, బీబీపేట, దోమకొండ, రామారెడ్డిల్లో 37.2 డిగ్రీలు, పిట్లంలో 37.1 డిగ్రీలు, సదాశివ్నగర్, పెద్దకొడప్గల్, సోమూర్లో 37 డిగ్రీలు, కామారెడ్డిలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.