ముషీరాబాద్, వెలుగు: దోమలగూడలోని స్టేట్ ఆఫీస్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (బీఎస్జీ) చీఫ్కమిషనర్గా బుర్రా వెంకటేశం (ఐఏఎస్) గురువారం బాధ్యతలు చేపట్టారు. పదేళ్లుగా ఈ ఆర్గనైజేషన్ కుంటూ పడిందని, ఇక ముందు సంస్థ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.
సంస్థ 75 ఏళ్ల డైమండ్ జూబ్లీ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ముఠా గోపాల్, భవాని శంకర్ తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. సుమారు 500 మంది స్కాట్స్ అండ్ గైడ్స్ ఈ కార్యక్రమంలో
పాల్గొంటారన్నారు.