ఓ మై గాడ్: పెద్ద ప్రమాదమే తప్పింది.. కొంచెం ఉంటే బస్సు లోయలో పడేది..

ములుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.. జిల్లాలోని చల్వాయి సమీపంలో  ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. హనుమకొండ నుంచి ఏటూరునాగారం వెళ్తున్న వరంగల్ 2 డిపో బస్సు చల్వాయి సమీపంలో పొలాల్లోకి దూసుకెళ్లింది. స్టీరింగ్ లాక్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులొమ్ 50మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఘటనాస్థలానికి మరో 20 అడుగుల దూరంలో లోయలాంటి ప్రదేశం ఉండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే.. పలువురికి స్వల్ప గాయాలు మినహా ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

బస్సు స్టీరింగ్ లాక్ అయిన విషయం గమనించిన డ్రైవర్ బ్రేకులు వేసినప్పటికీ బస్సు కంట్రోల్ అవ్వలేదని.. ఇదే ప్రమాదానికి కారణమని తెలిపారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించి.. మిగతా ప్రయాణికులను వేరే బస్సులో తరలించినట్లు తెలిపారు.