భైంసాకు చేరిన బస్సు ప్రమాద బాధితులు

భైంసాకు చేరిన బస్సు ప్రమాద బాధితులు
  • రెండు ప్రత్యేక బస్సుల్లో వచ్చిన యాత్రికులు

భైంసా, వెలుగు: యూపీకి వెళ్లిన భైంసా యాత్రికులు గురువారం తిరిగొచ్చారు. అక్కడ జరిగిన బస్సు ప్రమాదంలో 54 మందికి చెందిన వస్తువులు, సామగ్రి, నగదు పూర్తిగా కాలిపోయాయి.  దీంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. సమాచారం తెలుసుకుని ముథోల్​ఎమ్మెల్యే రామారావు పటేల్​వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్​దృష్టికి తీసుకెళ్లారు. యాత్రికులను సురక్షితంగా భైంసాకు తరలించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అక్కడి పోలీసు, రెవెన్యూ, ఆర్ఎస్ఎస్​శ్రేణులు యాత్రికులకు వసతి కల్పించారు. 

బుధవారం రెండు ప్రత్యేక బస్సుల్లో యాత్రికులను భైంసాకు పంపించారు. భైంసాలోని ఎస్ఎస్​జిన్నింగ్ ఫ్యాక్టరీ వద్ద యాత్రికులకు ఎమ్మెల్యే స్వాగతం పలికారు. బస్సుల నుంచి దిగిన యాత్రికులు కుటుంబ సభ్యులు పట్టుకుని  కన్నీళ్లు పెట్టారు.   తీర్థయాత్రలో బస్సు అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన కుభీర్​మండలం పల్సికి చెందిన శీలం దురుపతి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు.  తీర్థయాత్రకు వెళ్లిన దంపతుల్లో భర్త మృతి చెందగా.. భార్య ఎల్లుబాయి తిరిగి రాగా.. ఆమె కన్నీళ్లు పెట్టడంతో ఎమ్మెల్యే ఓదార్చారు. ఆ తర్వాత  యాత్రికులకు భోజన వసతి కల్పించి స్వస్థలాలకు పంపించారు. కాగా.. యూపీకి చెందిన బస్సు డ్రైవర్లను ఎమ్మెల్యే సన్మానించి నగదును బహుమతిగా అందించారు.