-
బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. తొమ్మిది మంది మృతి
-
మధ్యప్రదేశ్‌లోని మహర్ జిల్లాలో ఘటన
మహర్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని మహర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మహర్లోని నేషనల్ హైవే 30పై శనివారం రాత్రి 11 గంటల సమయంలో రాళ్లతో నిండిన ఓ ట్రక్కు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, దాదాపు 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. మృతుల్లో ఏడుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. ఈ బస్సు 45 మంది ప్రయాణికులతో ప్రయాగ్‌రాజ్ నుంచి రేవా మీదుగా నాగ్‌పూర్‌కు బయలుదేరింది. మధ్యప్రదేశ్ లోని మహర్ జిల్లా నాదన్ దేహత్ పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే బస్సును ట్రక్కు ఢీకొట్టింది.