![యూపీలో మరో రోడ్డు ప్రమాదం..ట్రక్కును ఢీకొన్న బస్సు..రెండు వెహికల్స్ మంటల్లో దగ్ధం](https://static.v6velugu.com/uploads/2025/02/bus-caught-fire-accindent-took-place--shukulbazar-police-station-area-in-amethi-in-up_d6L95Niuws.jpg)
ఉత్తరప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..అమేధీలోని పుర్వాంచర్ ఎక్స్ ప్రెస్ హైవేపై బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా కాలిపోయింది.
ఈ ప్రమాందలో డ్రైవర్తో సహా నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
Also Read : కుంభమేళాకు వెళ్తుండగా ప్రమాదం
గ్వాలియర్ నుంచి గోరఖ్పూర్కు ప్రయాణికులతో బస్సు వెళ్తుండగా అమేథీలోని శుక్ల బాజార్ థానా ప్రాంతంలో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. టోల్గేట్ వద్ద ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గాయపడ్డ వారిని అంబులెన్స్లో సమీప ఆస్పత్రికి తరలించారు.