డ్రైవరా.. యముడా.. ఫోన్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్

ఖమ్మం: సెల్ఫోన్లో వీడియోస్ చూస్తూ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడు ఓ ఆర్టీసీ డ్రైవర్.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడాడు. కొత్తగూడెం డిపోకు చెందిన TS28TA2588 గల ఆర్టీసి బస్సు.. కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి వెళ్తోంది. మొబైల్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు బస్సు డ్రైవర్. దీంతో బస్సులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు..  దీనికి సంబంధించి.. బస్సులో ఉన్న ప్రయాణికుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన బస్సు డ్రైవర్.. నిర్లక్ష్యంగా వీడియో చూస్తూ బస్సు నడపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.