జగిత్యాల: పండగ పూటబస్సు డ్రైవర్లు సమ్మె నిర్వహించడంతో జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం జగిత్యాల బస్ డిపో వద్ద జీతాలు పెంచడం లేదని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఇందులోభాగంగా ప్రతి సంవత్సరం నవంబర్లో జీతాలు పెంచాల్సి ఉండగా ఇప్పటి జీతాలు పెంచలేదని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
దీంతో దాదాపుగా 25 బస్సులు డిపోలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. జగిత్యాల బాస్ డిపో మేనేజర్ డ్రైవర్లతో మంతనాలు జరుపుతున్నారు. అయినప్పటికీ జీతాల విషయంలో క్లారిటీ ఇచ్చేంతవరకూ సమ్మె విరమించమని డ్రైవర్లు చెబుతున్నారు.