కందవాడకు బస్సు సౌకర్యం

కందవాడకు బస్సు సౌకర్యం

 హైదరాబాద్, వెలుగు: చేవెళ్ల నియోజకవర్గంలోని కందవాడ గ్రామానికి గ్రేటర్ ​ఆర్టీసీ కొత్తగా బస్సు సౌకర్యం కల్పించింది. మంగళవారం నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. 592 నంబర్​తో రోజూ మెహిదీపట్నం నుంచి కందవాడకు మూడు ట్రిప్పులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్​హైదరాబాద్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​వెంకటేశ్వర్లు వెల్లడించారు. 

నానల్​నగర్, లంగర్​హౌస్, టీకే  బ్రిడ్జి, బండ్లగూడ క్రాస్​రోడ్స్, ఆరె మైసమ్మ, అప్పా జంక్షన్, గోల్డెన్​ఫామ్స్, ఉస్మాన్​సాగర్​క్రాస్​రోడ్స్, అజీజ్​నగర్, హిమాయత్ నగర్ క్రాస్​రోడ్స్, మొయినాబాద్, కనకమామిడి క్రాస్​రోడ్స్, కేతిరెడ్డిపల్లి క్రాస్​రోడ్స్, అప్పారెడ్డిగూడ క్రాస్​రోడ్స్, టోల్​కట్ట క్రాస్​రోడ్స్, ముడిమల్ క్రాస్​రోడ్స్, కందవాడ క్రాస్​రోడ్స్, మల్కాపూర్, పాలగుట్ట, కేసారం/కందవాడ, చేవెళ్ల వరకు బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. మెహిదీపట్నం నుంచి ఉదయం 8, మధ్యాహ్నం 1.30, 3.55 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు.