బస్సు ఛార్జీలు అంటే ఏడాదికో.. రెండేళ్లకో పెరుగుతూనే ఉంటాయి. కానీ అక్కడ 8 ఏళ్ల తర్వాత ఛార్జీలు పెరిగడం విశేషం. 2018 తర్వాత టికెట్ ధరలు పెంచడం ఇదే మొదటి సారి. పుదుచ్ఛేరి ప్రభుత్వం తాజాగా బస్సు ఛార్జీలను 8 ఏళ్ల తర్వాత రూ.8 పెంచింది. పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాశ్ నాథన్ అదేశాలతో రవాణా శాఖ అదనపు కార్యదర్శి ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించారు.
Also Read :- ముంబై టూ హైదరాబాద్ బస్సులో భారీగా డ్రగ్స్ సరఫరా
పెరిగిన ఛార్జీల ప్రకారం నాన్ ఏసీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.5 నుంచి రూ.7 పెంచగా.. గరిష్టంగా రూ.13 నుంచి రూ.17 పెరిగాయి. ఇక ఏసీ బస్సుల్లో కనీసం ఛార్జీ రూ.10 నుంచి రూ.13 కు పెంచగా.. గరిష్టంగా రూ.26 నుంచి రూ.34 కు పెరిగాయి.
నాన్ ఏసీ డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలు కనిష్టంగా రూ.12 నుంచి రూ.16కు.. గరిష్టంగా రూ.36 నుంచి రూ.47 కు పెంచారు. పెంచిన ఛార్జీలు కనిష్టంగా రూ.3 పెంచగా.. గరిష్టంగా రూ.8 కి పెరిగింది.