సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బుధవారం తెల్లవారుజూమున రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌కు చెందిన కూలీలు లాక్‌డౌన్ ముగియడంతో తిరిగి పనుల కోసం ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్నలీలాధరి ప్రైవేట్ ట్రావెల్ బస్ ఖమ్మం- కోదాడ రహదారిపై హెచ్ఆర్ స్కూల్ కమాన్ వద్ద అదుపు తప్పి జనవాసాల్లోకి దూసుకెళ్లింది. బుధవారం
తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్‌లో 40 మంది ప్రయాణికులు ఉండగా నలుగురికి గాయాలయినట్లు సమాచారం. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఖమ్మం, విశాఖపట్నంలలోని వివిధ కంపెనీలు, షాపుల్లో పని చేసే వలస కార్మికులుగా తెలుస్తోంది. బస్ రెండు కరెంటు స్తంభాల మధ్యలో నుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. బస్ కరెంట్ స్తంభానికి ఢీకొని ఉంటే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండేది. బస్ ఇంట్లోకి దూసుకెళ్లడంతో పిట్టగోడ, బాత్రూం ద్వంసం అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సహాయంతో బస్‌ను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
For More News..