బస్సు, లారీ ఢీకొని డ్రైవర్‌‌‌‌ మృతి

 బస్సు, లారీ ఢీకొని డ్రైవర్‌‌‌‌ మృతి

 

  • మరో పది మంది ప్రయాణికులకు గాయాలు
  • యాదాద్రి జిల్లా దండుమల్కాపూరం వద్ద ప్రమాదం

చౌటుప్పల్ వెలుగు : లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బస్‌‌‌‌ డ్రైవర్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోగా, అందులో ఉన్న పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం పరిధిలో సోమవారం జరిగింది. చౌటుప్పల్ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ మన్మథకుమార్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్‌‌‌‌ బస్సు 40 మంది ప్రయాణికులతో నల్గొండ నుంచి హైదరాబాద్‌‌‌‌కు వెళ్తోంది. చౌటుప్పల్‌‌‌‌ మండలం దండుమల్కాపురం వద్దకు రాగానే బస్సు ముందు వెళ్తున్న లారీ సడన్‌‌‌‌గా బ్రేక్‌‌‌‌డౌన్‌‌‌‌ అయి ఆగిపోయింది.

 దీంతో డ్రైవర్‌‌‌‌ బస్సును కంట్రోల్‌‌‌‌ చేయలేకపోవడంతో లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్‌‌‌‌ డ్రైవర్‌‌‌‌ సలీం పాషా (51) అక్కడికక్కడే చనిపోగా, బస్సులో ప్రయాణిస్తున్న పది మందికిపైగా గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న చౌటుప్పల్‌‌‌‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్‌‌‌‌ మృతదేహం క్యాబిన్‌‌‌‌లో ఇరుక్కుపోవడంతో సుమారు అరగంట పాటు శ్రమించి డెడ్‌‌‌‌బాడీని బయటకు తీశారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. సివిల్‌‌‌‌, ట్రాఫిక్‌‌‌‌ పోలీసులు కలిసి ట్రాఫిక్‌‌‌‌ను క్లియర్‌‌‌‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

నడిచి వెళ్తుండగా కారు దూసుకెళ్లి...

మెదక్, వెలుగు : రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారి మీది నుంచి కారు దూసుకెళ్లడంతో మహిళ చనిపోయింది. ఈ ప్రమాదం మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని 44వ నేషనల్‌‌‌‌ హైవేపై సోమవారం జరిగింది. నార్సింగి గ్రామానికి చెందిన వట్టెపు లక్ష్మి (48), నాగరాజు దంపతులు హైవే పక్కన నడుచుకుంటూ పొలానికి వెళ్తున్నారు. ఈ టైంలో ఓ కారు స్పీడ్‌‌‌‌గా వచ్చి వారి మీద నుంచి దూసుకెళ్లింది. 

ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే చనిపోగా నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు నాగరాజును రామాయంపేట సర్కార్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు.