హైదరాబాద్లో బస్సు బీభత్సం.. బైక్ను ఢీకొని.. డివైడర్ దాటడంతో భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్లో బస్సు బీభత్సం.. బైక్ను ఢీకొని.. డివైడర్ దాటడంతో  భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది.  నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ ప్రధాన రహదారిపై బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఆపై డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు..  విద్యుత్ స్తంభాన్ని  ఢీ కొట్టడంతో రోడ్డుపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఈ ప్రమాదంలో బైక్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. బస్సు డివైడర్ దాటి రోడ్డు అవతలివైపుకు దూసుకుపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో కవరేజ్ కోసం వచ్చిన మీడియాపై బస్సు ఓనర్ చిందులు వేశాడు. వీడియోలు తీయొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణం చెప్పారు. వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.