- వైరల్‌గా మారిన వీడియో
- కరీంనగర్ జిల్లా మల్లాపూర్
- స్కూల్ టీచర్ షరీఫ్ అహ్మద్ వినూత్న ఆలోచన
తిమ్మాపూర్, వెలుగు : మానవీయ విలువలపై స్టూడెంట్లకు అవగాహన కల్పించేందుకు వినూత్న పద్ధతిలో ‘బస్ మోడల్’ విధానంలో బోధించాడు ఓ టీచర్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో షరీఫ్ అహ్మద్ హిందీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. స్టూడెంట్లకు మానవీయ విలువలను నేర్పేందుకు వినూత్నంగా ఆలోచన చేశాడు.
బస్సులో ప్రయాణం చేసే టైంలో అంధులు, దివ్యాంగులు, గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు బస్ ఎక్కిన టైంలో ఎలా ప్రవర్తించాలో స్టూడెంట్లను బస్ మోడల్ విధానంలో కూర్చోబెట్టి అవగాహన కల్పించారు. స్టూడెంట్లకు పాఠాలు నేర్పించడమే కాకుండా మానవీయ విలువలు సైతం నేర్పిస్తేనే సమాజంలో మంచి మనుషులుగా ఎదుగుతారని చెప్పారు. టీచర్ వినూత్న ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.
రామును రిమాండ్‌కు పంపించామని, మిగతా నలుగురిని సైతం పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గంజాయితో పాటు బొలెరో, మేరాజ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ రాజశేఖరరాజు, వన్‌టౌన్, హాలియా సీఐలు సుధాకర్, జనార్ధన్, ఎస్సైలు సతీశ్, రవి పాల్గొన్నారు.