గుజరాత్ లో బస్సు బోల్తా.. ఒకరు మృతి

గుజరాత్ లో బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ నుంచి 27 మంది ప్రయాణికులు చార్దామ్ యాత్రకు ఓ బస్సు బయల్దేరారు. బద్రీనాథ్ హైవేపై కౌడియాల సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.  ఈ ప్రమాదంలో మహిళ చనిపోగా, మరో 16 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ ధల్వాలా బృందం, పోలీసులు క్షతగాత్రులను ఎయిమ్స్ కి తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

బ్రేకులు పడలేదా..?

బ్రేకులు వేడెక్కడంతో బ్రేకులు పడలేదని దీంతో బస్సు అదుపుతప్పినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన కల్పన(32)  గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ వాసి. పరారీలో ఉన్న డ్రైవర్ ఆచూకీ వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. యాత్రికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.