
కర్ణాటకకు చెందిన ఓ యువకుడు ఆర్టీసీ బస్సును దొంగిలించేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 02 జెడ్ 0552 నంబర్ బస్సును ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. ఎవరూ లేని సమయంలో ధర్మవరం డిపో నుంచి బస్సు ఎక్కి వేగంగా డ్రైవ్ చేసుకుని వెళ్లాడు. ఆ సమయంలో గమనించిన డ్రైవర్లు, ఇతర సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నేకొత్తపల్లి, గుట్టూరు మీదుగా బెంగళూరు వెళ్లేందుకు యత్నించిన ఆ దుండగుడిని పోలీసులు కియా కంపెనీ సమీపంలో అడ్డగించి.. అరెస్టు చేశారు. బస్సును దొంగిలించిన వ్యక్తి.. బెంగళూరుకు చెందిన ముజామిల్ ఖాన్ (34 ఏళ్లు)గా గుర్తించారు.