బెంగళూర్ నుంచి వరంగల్ వైపు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సోమవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. జనగామ జిల్లా యశ్వంతపూర్,- నిడిగొండ మధ్య జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది. రన్నింగ్‌లో ఉన్న బస్సు టైరు పేలడంతో స్సీడ్ లో ఉన్న బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ యాక్సిడెంట్ లో దాదాపు 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురు పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు. నేషనల్ హైవే కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి వరంగల్ కు వస్తున్న క్రమంలో ప్రమాదానికి గురైంది.