
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. చింతపాలెం మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 నుంచి 30 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
కోదాడ డిపో కు చెందిన బస్సు కోదాడ నుంచి చింత్రియాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 నుఏంచి 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మేళ్లచెరువు, హుజూర్ నగర్ ఏరియా హాస్పటలకు 108 ద్వారా తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 నుంచి 60 ప్రయాణికులు ఉన్నారు. ఇంకా దీనికి సండంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. . .